News November 29, 2024

‘ఆర్మీ’ని అవమానించారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు

image

తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్‌ ‘ఆర్మీ’ అనే పదాన్ని వాడటాన్ని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. తనకూ ఓ ఆర్మీ ఉందంటూ దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆయన వ్యవహరించారని HYDలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్‌పై FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 5, 2026

GALLERY: ‘విరోష్’ రిసెప్షన్.. తళుక్కుమన్న తారలు

image

విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. నానీ, వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, అల్లుఅర్జున్, కార్తీ, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్ తదితరులు నూతన వధూవరులకు గ్రీటింగ్స్ చెప్పారు. ఇక రాజకీయ ప్రముఖుల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విరోష్ జంటకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.

News March 5, 2026

అధికారులు బడి భోజనం చేయాల్సిందే..

image

TG: స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను సర్కారు సీరియస్‌గా తీసుకుంది. అలాంటివి జరగకుండా కలెక్టర్ నుంచి స్పెషలాఫీసర్లు, ఇతర అధికారులు హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేయాలని CM ఆదేశించారు. రానున్న ‘99 రోజుల ప్రజాపాలన’ నుంచే దీనిని ఆరంభించాలన్నారు. విద్యా సంవత్సరం మొత్తం అమల్లో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భుజించాలన్నారు.

News March 5, 2026

సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్!

image

ప్రపంచకప్ గెలవాలనుకున్న సౌతాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది. T20 WC-2026లో సెమీస్‌లో బోల్తా పడింది. ఈ ఎడిషన్‌లో ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన SA ఆశలపై న్యూజిలాండ్ <<19299856>>నీళ్లు చల్లింది<<>>. 2024 ఫైనల్‌లోనూ చివరి దాకా పోరాడి ఇండియా చేతిలో SA ఓడిపోయింది. గతేడాది మహిళల జట్టు ODI WC ఫైనల్‌లో భారత్ చేతిలోనే పరాజయం పాలైంది. తాజా ఓటమితో సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. better luck next time.