News November 29, 2024
అందరి సపోర్ట్ భారత్‌కే.. ఒంటరైన పాక్!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు భారత్‌కే సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ఒప్పుకోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒంటరైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భద్రత దృష్ట్యా అక్కడికి వెళ్లేది లేదని భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోర్నీ పాకిస్థాన్ నుంచి తరలించి వేరే దేశాల్లో నిర్వహించేందుకు ICC కసరత్తు చేస్తోంది.
Similar News
News November 30, 2024
క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?
క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.
News November 30, 2024
గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన రూ.92 కోట్లు చెల్లించారు. ఆయన తర్వాతి స్థానంలో దళపతి విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్(రూ.75 కోట్లు) ఉన్నారు. వారి తర్వాత స్థానాల్లో అమితాబ్(రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.66 కోట్లు) నిలిచారు. మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ.20 కోట్లతో టాప్‌లో ఉన్నారు.
News November 30, 2024
24 గంటల్లో శిండే పెద్ద నిర్ణయం తీసుకుంటారు: సంజయ్ శిర్సత్
మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై స్పష్టత రాని నేపథ్యంలో శిండే వర్గం నేత సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల్లో షిండే పెద్ద నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. కాగా సీఎం ఎవరనేది అమిత్ షానే నిర్ణయిస్తారని తెలిపారు. డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు శిండే ఆకస్మాత్తుగా సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.