News November 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కథలాపూర్ మండలంలో మోడల్ స్కూల్‌ను, వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహాలింగార్చన.
@ ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
@ మెట్ పల్లి పట్టణంలో ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్.
@ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.

Similar News

News November 30, 2024

KNR: డిసెంబర్ 1 నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు: కలెక్టర్

image

డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. విజయోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. విద్యాశాఖ తరఫున విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వైద్య శాఖ తరఫున హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 29, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్ర వారం రూ.3,09,170 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,173, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,13,510, అన్నదానం రూ.38,487,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

News November 29, 2024

సర్వే 100 శాతం పూర్తి చేయాలి: KNR కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల రిత్యా అక్కడక్కడ కొన్ని ఇండ్లు మిగిలిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి సర్వే పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసుకునేందుకు మండల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.