News November 30, 2024
నేడు నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరుకు శనివారం ఉదయం రానున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్లో పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సభ్యత నమోదు కార్యక్రమం పై డివిజన్ సంబంధించిన ప్రెసిడెంట్లతో ప్రధానంగా చర్చించుచున్నారని ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు, నాయకులు అందుబాటులో ఉండాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
నాయుడుపేట: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పెళ్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై అదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమార్‌ను 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్‌కు నెల్లూరులో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

నెల్లూరు నగరంలోని పలు రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని రెస్టారెంట్ యజమానులు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువత మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను పెద్ద స్క్రీన్‌లో, స్నేహితులతో కేరింతలు కొడుతూ చూడాలని ఆశతో ఉన్నారు.
News March 8, 2026
నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.


