News November 30, 2024
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు చొరవ చూపాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రీ సర్వే, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ మ్యుటేషన్లకు సంబంధించి రావడం జరుగుతున్నదని తెలిపారు.
Similar News
News February 28, 2026
’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.
News February 28, 2026
సిద్ధవటంలో చిరుత సంచారం

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.
News February 28, 2026
కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


