News November 30, 2024

పాముకాటు కేసులు నమోదు చేయండి: కేంద్రం

image

పాముకాటు కేసులను గుర్తింపదగిన వ్యాధులుగా ప్రకటించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. సంబంధిత కేసులు, మరణాల నివేదికను తప్పనిసరి చేయాలని పేర్కొంది. పాము కాటు ప్రజా సమస్య అని, దీంతో మరణాలు, అనారోగ్యానికి కారణమవుతుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాముకాటు సమస్యను నివారించడానికి జాతీయ కార్యచరణ ప్రణాళికను ఆవిష్కరించినట్లు తెలిపారు.

Similar News

News November 30, 2024

ఏపీలో కొత్తగా 88 పీహెచ్‌సీలు

image

AP: రాష్ట్రంలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్‌సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

News November 30, 2024

నేడు పింఛన్ల పంపిణీ

image

AP: రేపు(ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. CBN ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు.

News November 30, 2024

నేడు భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్

image

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు మహ్మద్ అమన్ సారథ్యం వహిస్తున్నారు. జట్టులో IPL వండర్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. U19 ఆసియా కప్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. తొమ్మిదో టైటిల్ బరిలో భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది.