News November 30, 2024
కోహ్లీ.. ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?

BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.
Similar News
News January 12, 2026
బీర సాగుకు అనువైన విత్తన రకాలు

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్.ఎస్.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.
News January 12, 2026
ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎవరికిస్తారో తెలుసా?

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ముందుగానే అర్హత నిర్ధారించి ఎంపిక చేసిన కస్టమర్లకు ఇస్తాయి. ఆదాయం, సిబిల్ స్కోర్, లావాదేవీల ఆధారంగా లోన్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాయి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి SMS లేదా ఈమెయిల్ పంపిస్తాయి. తక్కువ డాక్యుమెంట్స్‌తో లోన్ మంజూరు చేస్తాయి. అయితే అధిక వడ్డీ ఉండే అవకాశం ఉంది. దీంతో అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


