News November 30, 2024

ఏపీలో కొత్తగా 88 పీహెచ్‌సీలు

image

AP: రాష్ట్రంలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్‌సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

Similar News

News November 30, 2024

నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్

image

AP: నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

News November 30, 2024

ఈ విషయంలో ‘బాహుబలి-2’ను ‘పుష్ప-2’ బ్రేక్ చేస్తుందా?

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ DEC 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 12000+ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇండియాలో 8500+ స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్ దృష్ట్యా మరిన్ని స్ర్కీన్లు సిద్ధం చేస్తామన్నాయి. కాగా భారతీయ చరిత్రలో అత్యధికంగా 9000+ స్క్రీన్స్‌లో బాహుబలి-2 రిలీజ్ చేసినట్లు తెలిపాయి.

News November 30, 2024

చైనాలో ‘మహారాజ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ₹15 కోట్లు!

image

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా నిన్న చైనాలో రిలీజైంది. ఆ దేశవ్యాప్తంగా మొత్తం 40,000+ స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వస్తోందని సినీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ మూవీ రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.100కోట్ల మార్క్ దాటిన విషయం తెలిసిందే.