News November 30, 2024
TGలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ప్రస్తుతం ఎంతంటే?
TGలో టూ వీలర్ల ధర ₹50వేలలోపు ఉంటే 9%, ₹50వేలకంటే ఎక్కువ ఉంటే 12% లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇక కర్ణాటకలో 18%, కేరళలో 20% చెల్లించాల్సి ఉంటుంది. TGలో 4 వీలర్ల ధర ₹5లక్షల్లోపు ఉంటే 13%, ₹5L-₹10Lకు 14%, ₹10L-₹20Lకు 17%, ₹20L+కు 18% ట్యాక్స్ విధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో లైఫ్ ట్యాక్స్ 20% నుంచి 21%గా ఉంది. కాగా TGలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
Similar News
News November 30, 2024
ఇంద్రధనుస్సు రంగులో మొక్కజొన్నను చూశారా?
సాధారణంగా మొక్కజొన్న కంకులు పచ్చరంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అమెరికాలో పండే హెర్లూమ్ మొక్కజొన్న ఇంద్రధనుస్సు రంగులతో ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీని ఫొటోలను నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ ‘ఇంత అందంగా ఉంటే ఎలా తింటాము’ అని పోస్టులు పెడుతున్నారు. దీనిని అక్కడి ప్రజలు ‘ఇండియన్ కార్న్’ అని పిలుస్తుంటారు. కార్న్ లియోన్ బర్న్స్ అనే వ్యక్తి ఈ మొక్కజొన్నను సృష్టించారు.
News November 30, 2024
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
News November 30, 2024
రెండో టెస్టులో ఆ ముగ్గురిపై వేటు పడొచ్చు: గవాస్కర్
డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్‌లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.