News November 30, 2024
ALERT.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు!
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, WGL, మహబూబాబాద్, HNKలో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఎల్లుండి కరీంగనర్, PDPL, సిద్దిపేట, RR, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.
Similar News
News November 30, 2024
ఫ్లాప్ హీరో.. కానీ స్టార్ హీరోల కంటే ధనవంతుడు
‘రక్తచరిత్ర’ సినిమాలో పరిటాల రవి రోల్లో నటించిన వివేక్ ఒబెరాయ్ గుర్తున్నారా? ఆయన ఫ్లాప్ హీరోగా అపకీర్తి సంపాదించుకున్నప్పటికీ మరో రంగంలో చక్రం తిప్పుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో శ్రమించి రూ.1200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన వివిధ సంస్థలు, ఓ ప్రైవేటు యూనివర్సిటీలోనూ పెట్టుబడులు పెట్టారు. దీంతో ఎంతో మంది స్టార్ నటుల కంటే ధనవంతుడయ్యారు.
News November 30, 2024
డిటాక్స్ బార్స్, IV డ్రిప్స్: పెళ్లి వేడుకల్లో కొత్త ట్రెడిషన్
పెళ్లి వేడుకల్లో కాక్టైల్, లిక్కర్ పార్టీలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. వివాహ సమయంలో వధూవరులు, బంధువులు హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడకుండా వెడ్డింగ్ ప్లానర్స్ డిటాక్స్ బార్లను ఏర్పాటుచేయడం పెరిగింది. ఇందులో ఫ్రెష్ జ్యూసెస్, వెల్నెస్ డ్రింక్స్‌తో IV డ్రిప్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కొత్త ట్రెడిషన్ ప్లాన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అతిథులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడానికి ఉపయోగపడుతోంది.
News November 30, 2024
అలా చేస్తే యుద్ధంలో కీలక దశను ఆపేస్తాం: జెలెన్ స్కీ
తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను నాటో కిందికి తీసుకొస్తే రష్యాతో యుద్ధంలో కీలక దశను ఆపేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ మొత్తానికి నాటో మెంబర్షిప్ ఇవ్వాలని, ముందుగా అంతర్జాతీయ సరిహద్దు భూభాగాలకు నాటో భద్రత కల్పించాలన్నారు. అలా చేస్తే ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాలను దౌత్యమార్గంలో తిరిగి పొందడానికి చర్చలు జరుపుతామన్నారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు.