News November 30, 2024

సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 30, 2024

మాది ప్రజా ప్రభుత్వం.. రైతు రాజ్యం: మంత్రి పొన్నం

image

మాది ప్రజా ప్రభుత్వ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.18,000 కోట్లు, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, రైతు బీమాకు రూ.1455 కోట్లు, పంటల భీమాకు రూ.1,300 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.10,444 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.5,040 కోట్లు కేటాయించామన్నారు.

News November 30, 2024

సిర్గాపూర్: మృత్యువుతో పోరాడి ఓడిన యువతి

image

అరవై శాతం శరీరం కాలిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన మీనా హనుమంతరావు దంపతుల కూతురు స్నేహలత(18)పై ఈనెల 22న ఓ అగంతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గాయపడ్డ ఆమెకు HYDలో చికిత్స అందించారు. 60 శాతం శరీరం కాలిన యువతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.

News November 30, 2024

సంగారెడ్డి: డిసెంబర్ 4న ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

image

సంగారెడ్డి కలెక్టరేట్లో డిసెంబర్ 4న ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అత్తర్ బహిరంగ విచారణకు హాజరవుతారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు బహిరంగ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.