News November 30, 2024

అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి

image

AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

Similar News

News November 30, 2024

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

image

అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రాపర్తినగర్‌కు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

News November 30, 2024

రెండో టెస్టులో ఆ ముగ్గురిపై వేటు పడొచ్చు: గవాస్కర్

image

డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్‌లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

News November 30, 2024

ఫ్లాప్ హీరో.. కానీ స్టార్ హీరోల కంటే ధనవంతుడు

image

‘రక్తచరిత్ర’ సినిమాలో పరిటాల రవి రోల్‌లో నటించిన వివేక్ ఒబెరాయ్ గుర్తున్నారా? ఆయన ఫ్లాప్ హీరోగా అపకీర్తి సంపాదించుకున్నప్పటికీ మరో రంగంలో చక్రం తిప్పుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో శ్రమించి రూ.1200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన వివిధ సంస్థలు, ఓ ప్రైవేటు యూనివర్సిటీలోనూ పెట్టుబడులు పెట్టారు. దీంతో ఎంతో మంది స్టార్ నటుల కంటే ధనవంతుడయ్యారు.