News November 30, 2024

ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలు!

image

TG: ఫోన్ చేస్తే రైతుల ఇంటికే వరి విత్తనాలను సరఫరా చేసే సేవలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. తెలంగాణ సోనా, కూనారం, జగిత్యాల సన్నాలు, దొడ్డు రకాలు KNM 118, JGL 24423, MTU 1010, RNR 29325 విత్తనాలను సరఫరా చేస్తోంది. 15kgs బస్తా ధర ₹700, 25kgs బస్తాకు ₹995గా నిర్ణయించింది. రైతులు ప్రాంతీయ మేనేజర్లకు ఫోన్ చేస్తే రవాణా ఛార్జీలు లేకుండానే విత్తనాలు సరఫరా చేస్తారని వెల్లడించింది.

Similar News

News July 7, 2025

ఇవాళ టారిఫ్ లెటర్స్ పంపిస్తాం: ట్రంప్

image

వివిధ దేశాలకు తాము ఇవాళ మ.12 గంటలకు (9:30 PM IST) టారిఫ్ లెటర్స్ పంపనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. BRICS అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ పేర్కొన్నారు.

News July 7, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేశుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 59వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 880.40 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 190.33 TMCలుగా ఉంది. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.