News November 30, 2024
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.5,259

ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు మార్కెట్‌లో నిన్న గరిష్ఠంగా క్వింటా రూ.5,259 పలికింది. మధ్యస్థ ధర రూ.3,519గా ఉంది. ఉల్లి ధర అమాంతం పెరిగినా ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా రూ.14,859 మాత్రమే పలికింది. గతేడాది ఇదే సమయానికి సుమారు రూ.25వేలు పలకడం విశేషం. ఇక వేరుశనగ కాయలు గరిష్ఠంగా రూ.6,850తో విక్రయాలు సాగుతున్నాయి.
Similar News
News April 3, 2026
విషాదం.. లారీ బోల్తా పడి రైతు మృతి

మంత్రాలయం మండలం రచ్చమర్రిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకోబు గుంటూరులో మిరపకాయలు అమ్ముకుని తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు ఘాట్ వద్ద లారీ బోల్తా పడటంతో బియ్యం సంచులు మీద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పలువురు ప్రజా సంఘాలు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
News April 3, 2026
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.