News November 30, 2024
VZM: భార్య, కుమారుడి మృతి.. భర్త ఆత్మహత్య

పటాన్‌చెరు పరిధిలో విజయనగరం జిల్లా వాసి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం రామచంద్రాపురానికి చెందిన రామానాయుడు(38) భార్యతో కలిసి HYD వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా 9ఏళ్ల క్రితం భార్య సూసైడ్ చేసుకోగా పిల్లలు అత్తామామల వద్ద ఉంటున్నారు. 4 నెలల క్రితం చిన్న కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కుమిలిపోయిన అతడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు.
Similar News
News March 18, 2026
VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.
News March 18, 2026
VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.