News November 30, 2024
ఎచ్చెర్ల: పింఛను సొమ్ము కోసం దాడి

పింఛను సొమ్ము కోసం సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుని కథనం..ఎస్ఎం పురం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ఎచ్చెర్ల SBIలో రూ. 24 లక్షలకు పైగా డ్రా చేసుకుని వస్తున్నారు. గమనించిన ఇద్దరు ఆగంతకులు బైకు ఆపే ప్రయత్నం చేసి, రాడ్డుతో దాడి చేయగా తప్పించుకుని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 19, 2026
రణస్థలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానని మనస్థాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలో జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు(17) ఇంటర్ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News March 19, 2026
సిక్కోలులో సైబర్ మోసం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
News March 19, 2026
కవిటి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలిపై నెలవంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు వారం రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు.


