News November 30, 2024
రైతుబంధు, బోనస్.. ఏది మంచిది?

TG: రైతుబంధు, బోనస్.. ఈ రెండింట్లో ఏది మంచిదనే దానిపై చర్చ జరుగుతోంది. పంట వేయడానికి ముందు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చింది. దీని ద్వారా అవసరమైన సమయానికి రైతు చేతికి డబ్బులు అందుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వరి క్వింటా రూ.3వేలు పలుకుతుండగా, రూ.500 బోనస్ ఇస్తోంది. ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే అదనంగా రూ.10-12వేలు వస్తాయి.
Similar News
News April 19, 2026
తిరుపతి: ‘నేను ప్రేమించా.. ఆమె మోసం చేసింది’

ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిరుపతి వెస్ట్ పోలీసుల వివరాల మేరకు.. గంగవరం(M) వేమనపల్లెకు చెందిన మహేంద్ర(20) బీకాం చదువుతూ వెంకటరమణ లే అవుట్‌లో ఉంటున్నాడు. మహేంద్ర ఓ యువతిని ప్రేమించగా ఆమెకు వారం క్రితం పెళ్లయింది. దీంతో ‘నేను సూసైడ్ చేసుకుంటున్నా. నేను అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆమె మోసం చేసింది’ అని వాట్సాప్ మెసేజ్ పంపి సూసైడ్ చేసుకున్నాడు.
News April 19, 2026
అశ్వగంధ ఆకులతో హాని.. వాడొద్దు: FSSAI

ఔషధాలు, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు లేదా దాని సారాన్ని మాత్రమే వాడాలని తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశించింది. ఆకులను పౌడర్ రూపంలో లేదా వేరే ఏ ఇతర రూపంలోనూ వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆకుల వాడకం వల్ల కాలేయం, నరాలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్నీ వాడుతున్నదీ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది.
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.


