News November 30, 2024

చైనాలో ‘మహారాజ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ₹15 కోట్లు!

image

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా నిన్న చైనాలో రిలీజైంది. ఆ దేశవ్యాప్తంగా మొత్తం 40,000+ స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వస్తోందని సినీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ మూవీ రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.100కోట్ల మార్క్ దాటిన విషయం తెలిసిందే.

Similar News

News February 1, 2026

సిట్‌కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు: KTR

image

TG: ఇవాళ జరిగిన సిట్ విచారణకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ప్రతి ప్రశ్నకు కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు. ఎలాంటి తప్పు జరగలేదని తేలిపోయింది. కేసులో డొల్లతనం బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో మా అటెన్షన్‌ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారు’ అని దుయ్యబట్టారు.

News February 1, 2026

40 గంటలు.. 193 మంది మృతి

image

పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ ఘర్షణలతో అట్టుడుకుతోంది. 40 గంటలపాటు BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన దాడుల్లో 193 మంది చనిపోయారు. వీరిలో 145 మంది రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా పాక్‌ విస్తీర్ణంలో 42 శాతం ప్రాంతం ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కావాలని కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.

News February 1, 2026

3 ఏళ్లలో కీబోర్డ్‌లు ఉండవు.. SAP CEO ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

మూడేళ్లలో కీబోర్డ్‌లు కనుమరుగవుతాయని SAP CEO క్రిస్టియన్ క్లైన్ జోస్యం చెప్పారు. AI, LLM వల్ల వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ అద్భుతంగా పని చేస్తోందని.. డేటా ఎంట్రీ కోసం టైపింగ్ అవసరం ఉండదని చెప్పారు. 1714లో హెన్రీ మిల్ టైప్‌రైటర్ కాన్సెప్ట్‌తో మొదలైన 312 ఏళ్ల కీబోర్డ్ ప్రస్థానం త్వరలో వాయిస్ కమాండ్స్‌తో ముగియనుందన్నారు. మాట్లాడటం ద్వారానే సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌తో పని చేయొచ్చని వెల్లడించారు.