News November 30, 2024
నెల్లూరు: పెన్నానదికి హై అలర్ట్ !

పెన్నానదికి భారీగా వరద పోటెత్తే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెన్నానదికి వరదలు సంభవించవచ్చని జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Similar News
News November 4, 2025
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News November 4, 2025
అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు జిల్లా సంబంధిత శాఖ సమన్వయ అధికారిణి డాక్టర్ సి. ప్రభావతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
News November 4, 2025
నెల్లూరు: సగం బిల్లే ఇచ్చారని TDP నాయకుడి ఆవేదన

గుడ్లూరు(M) చినలాటరపికి చెందిన TDP నాయకుడు మల్లికార్జున ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం హల్‌చల్ చేశారు. 2014-19 మధ్య చేసిన పనులకు రూ.10 లక్షల బిల్లులు ఆగిపోయాయని, తాజాగా రూ.3.5 లక్షలే విడుదల చేశారని చెప్పారు. మిగిలినవి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లులు చెల్లిస్తామని MPDO తెలిపారు.


