News November 30, 2024
రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్
TG: ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకునేందుకు ఉమ్మడి పాలమూరుకు వస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు, పోలింగ్ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 30, 2024
మీకు తెలుసా: క్యారమ్స్ ఎక్కడ పుట్టిందంటే…
క్యారమ్స్ గేమ్ గురించి తెలియనివారు చాలా తక్కువగా ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులతో ఆడుకునేందుకు అనువైన చక్కటి టైమ్ పాస్ గేమ్ ఇది. ఈ ఆట భారత్‌లోనే పుట్టింది. 20వ శతాబ్దం మొదట్లో రాజకుటుంబాలు ఈ ఆటను ఆడేవి. 1935లో భారత్, శ్రీలంక కలిసి తొలిసారిగా క్యారమ్స్ టోర్నీ నిర్వహించాయి. ఆ తర్వాత 1988లో అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ చెన్నైలో ఏర్పడింది. పటియాలా ప్యాలెస్‌లో నేటికీ అద్దపు క్యారమ్ బోర్డు ఉంది.
News November 30, 2024
డిసెంబర్ 5న కొలువుదీరనున్న MH సర్కారు?
మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువు దీరుతుందని BJP వర్గాలు తెలిపాయి. సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ‘మహాయుతి’ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని తెలిపాయి. BJP శాసనసభాపక్ష సమావేశం DEC 2 లేదా 3వ తేదీన ఉంటుందని, అప్పుడే ఆ పార్టీ LP నేతను ఎన్నుకుంటుందని చెప్పాయి. అటు శిండే స్వగ్రామంలో ఉండగా, ఫడణవీస్ సీఎం పీఠం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో CM ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.
News November 30, 2024
రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం: CM
AP: రేషన్ బియ్యాన్ని కొని విదేశాలకు అమ్ముతున్నారని CM CBN అన్నారు. వారిని వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా మాఫియా, దోపీడీనే ఉందని, అంతా ప్రక్షాళన చేస్తామన్నారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోనని తేల్చి చెప్పారు. గతంలో మద్యం పేరుతో విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం బెల్ట్ షాపులుంటే ఊరుకోనని CM చెప్పారు.