News November 30, 2024
పులివెందుల: కుమారుడిని చంపిన తండ్రి..!

కడప జిల్లాలో శనివారం దారుణ హత్య జరిగింది. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సుగాలి తండాలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కుళ్లాయప్ప నాయక్ తన కుమారుడు రాజ్ కుమార్ నాయక్‌ను దారుణంగా కొట్టి హతమార్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 20, 2026
సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News March 20, 2026
రైతుల నుంచి అధికంగా వసూలు చేస్తే చర్యలు: జ్యోతి

ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాలుకు రూ.75లు మించి వసూలు చేస్తే ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి హెచ్చరించారు. ప్రొక్యూర్ మెంట్ కేంద్రాల్లో రైతులందరికీ బహిరంగంగా కనిపించేలా ఛార్జీల వివరాలను, ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
News March 20, 2026
కడప: Way2News ఎఫెక్ట్.. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

కడప జిల్లాలో మార్క్‌ఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్‌ఛార్జ్‌లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.


