News November 30, 2024
ఆటోను మినీ లైబ్రరీగా మార్చేశారు!

బెంగళూరు ఆటో డ్రైవర్లు సరికొత్త ఇన్నోవేటివ్స్‌తో నెట్టింట వైరలవుతుంటారు. తాజాగా మరో డ్రైవర్ తన ఆటోను కస్టమర్ల కోసం మినీ లైబ్రరీగా మార్చేశారు. అందులో పదుల సంఖ్యలో పుస్తకాలను ఉంచారు. దీంతోపాటు కస్టమర్లకు ఏ పుస్తకమైనా నచ్చితే ఉచితంగా తీసుకోవచ్చని స్టిక్కర్ అంటించారు. ఓ నెటిజన్ దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Similar News
News November 8, 2025
చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్‌లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్‌ల టోటల్ వ్యూయర్‌షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్‌ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్‌తో సమానమని వెల్లడించింది.
News November 8, 2025
సినిమా అప్డేట్స్

* 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తుడరుమ్’ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమాలు ఎంపికయ్యాయి.
* కమెడియన్ సత్య హీరోగా ‘మత్తువదలరా’ ఫేమ్ రితేశ్ రాణా డైరెక్షన్‌లో మూవీ ప్రారంభమైంది.
* కమల్ హాసన్ హీరోగా ‘KHAA-హంట్ మోడ్ ఆన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ సినిమా రూపొందనుంది. స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బుమణి, అరివు మణి దర్శకత్వం వహిస్తారు.
News November 8, 2025
హిడ్మాను పట్టుకునేందుకు పక్కా ప్లాన్

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ రాష్ట్ర సరిహద్దుల్లో 2 వేల మంది జవాన్లతో చుట్టుముట్టారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. మ్యాపింగ్, థర్మల్ ఇమేజింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో అబూజ్‌మడ్ అడవులను జల్లెడ పడుతున్నారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.


