News November 30, 2024

తిరుమలలో వయోవృద్ధుల దర్శనాలపై ఫేక్ ప్రచారం!

image

తిరుమల వయోవృద్ధుల దర్శనాలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అవుతోంది. వాస్తవానికి సీనియర్ సిటీజన్ల దర్శనం ఆన్‌లైన్లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే రోజూ మధ్యాహ్నం 3గంటలకు ఉంటుంది. నేరుగా వస్తే అనుమతించరు. రోజు 1000 మందికి మాత్రమే ఈ కోటాలో దర్శనాలు కేటాయిస్తున్నారు. కానీ 65 ఏళ్లు దాటినవారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మధ్య ఫొటో ఐడీ, వయసు ధ్రువీకరణ పత్రం చూపిస్తే దర్శనం అయిపోతుందని ప్రచారం జరుగుతోంది.

Similar News

News November 8, 2025

కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

image

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.

News November 8, 2025

కనకదాసు చిత్ర పటానికి SP నివాళి

image

భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ శనివారం నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సమానత్వానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం కుల, మత తేడాలను చెరిపివేసేలా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.

News November 7, 2025

కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

image

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్‌గా CM చంద్రబాబు శంకుస్థాపన.