News November 30, 2024
మెదక్: దీక్షా-దివస్‌లో కనిపించని KCR!
దీక్షా-దివస్‌ను BRS శ్రేణులు సక్సెస్ చేశాయి. సోషల్ మీడియాలో KCR పోరాటానికి ఎలివేషన్స్ జత చేస్తూ ఆకాశానికి ఎత్తాయి. BRS MLAలు ర్యాలీలు తీసి KCR చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ నలుమూలల నాయకులు తెలంగాణ భవన్‌కు క్యూకట్టారు. కానీ, KCR మాత్రం బయటకురాలేదు. ఉద్యమంలో అంతా తానై నడిచిన గులాబీ బాస్ నిన్నటి దీక్షా-దివస్‌లో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకపోవడం గమనార్హం.
Similar News
News November 30, 2024
మెదక్: ప్రజా పాలన విజయోత్సవాలకు ఇన్‌ఛార్జిల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన విజయోత్సవాలకు టీపీసీసీ ఇన్చార్జిలను నియమించింది. సిద్దిపేట-నారాయణరెడ్డి, మెదక్-ఆకుల లలిత, ఖేడ్-లోకేశ్ యాదవ్, ఆందోల్-పహీమ్ ఖురేషి, నర్సాపూర్-ఆంజనేయులు యాదవ్, జహీరాబాద్-మన్నె సతీష్, సంగారెడ్డి శివసేనారెడ్డి, పటాన్ చెరు-మెట్టు సాయికుమార్, దుబ్బాక-శశికళ యాదవ రెడ్డి, గజ్వేల్-పారిజాత నరసింహారెడ్డి లను నియమించారు.
News November 30, 2024
MDK: నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం: మంత్రి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.
News November 30, 2024
మాది ప్రజా ప్రభుత్వం.. రైతు రాజ్యం: మంత్రి పొన్నం
మాది ప్రజా ప్రభుత్వ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.18,000 కోట్లు, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, రైతు బీమాకు రూ.1455 కోట్లు, పంటల భీమాకు రూ.1,300 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.10,444 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.5,040 కోట్లు కేటాయించామన్నారు.