News November 30, 2024
ప్రయాణాలు రద్దు చేసుకోండి: తిరుపతి కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫెంగల్ తుఫాన్‌గా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, పశు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉంటే కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూం(0877-2236007)ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 12, 2026
చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
News January 12, 2026
GDనెల్లూరు: CHC పూర్తయితే కష్టాలు తీరేనా.?

కార్వేటినగరం PHCలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. 50 పడకల CHC పూర్తయితే సివిల్ సర్జన్లు, మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, అనస్థీషియా నిపుణులు అందుబాటులో ఉండనున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, క్లాస్–4 సిబ్బంది అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు అంటున్నారు.
News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.


