News November 30, 2024

మహారాష్ట్ర CM రేసులో కొత్త పేరు!

image

మహారాష్ట్ర CM రేసులో కొత్త పేరు విన్పిస్తోంది. పుణె MP, కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మొహోల్ పేరును BJP అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరాఠా నేత అయిన మురళీకి బలమైన RSS మూలాలున్నాయి. గతంలో పుణే మున్సిపల్ మేయర్‌గా పని చేసిన ఇతనికి BJPలో చురుకైన నేతగా పేరుంది. వారం రోజులుగా మహారాష్ట్ర సీఎం పీఠం కోసం ఫడణవీస్, శిండే ఎదురుచూస్తుండగా, కొత్త పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

Similar News

News March 14, 2026

మళ్లీ వర్షాలు!

image

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 14, 2026

‘శల్య సారథ్యం’ అంటే?

image

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 14, 2026

సీఈసీని ఎలా తొలగించవచ్చు?

image

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్‌లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.