News November 30, 2024
DEC 3న కలవండి: కాంగ్రెస్‌కు ECI ఆహ్వానం

మహారాష్ట్రలో ఓటమికి EVMలను కాంగ్రెస్ నిందిస్తుండటంపై ECI స్పందించింది. డిసెంబర్ 3న తమను కలవాలని INC బృందాన్ని ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో అన్ని పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు భాగమవుతారని తాత్కాలిక స్పందనను తెలియజేసింది. కాంగ్రెస్ వివరించే సరైన అంశాలను సమీక్షించి, రాతపూర్వకంగా జవాబిస్తామని పేర్కొంది. పోలింగ్ శాతం అప్డేషన్ ప్రాసెస్‌లో పార్టీల భాగస్వామ్యం ఉంటుందని చెప్పింది.
Similar News
News March 19, 2026
ఆయిల్ టెన్షన్.. ₹10లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2496 పాయింట్లు కోల్పోయి 74,207 వద్ద సెటిల్ అవగా నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద సెటిల్ అయింది. ₹10లక్షల కోట్లకుపైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రెంట్ క్రూడ్ 118.14 డాలర్లకు, ముర్బాన్ క్రూడ్ 128.84 డాలర్లకు చేరడం మార్కెట్లను కుదిపేసింది. FII సెల్లింగ్, HDFC బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.
News March 19, 2026
2 నౌకల్లోని LPGతో ఎన్ని సిలిండర్లు నింపొచ్చో తెలుసా?

యుద్ధం వేళ హార్ముజ్ జలసంధిని దాటుకుని భారత్‌కు వచ్చిన శివాలిక్, నందాదేవి నౌకల్లో 92,712 మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని ద్వారా 65.3 లక్షల డొమెస్టిక్ సిలిండర్లను నింపొచ్చు. భారత్‌లో సగటున రోజుకు 55.7 లక్షల సిలిండర్లను రీఫిల్ చేసుకునేందుకు బుకింగ్స్ చేసుకుంటారు. ఇండియాకు చెందిన మొత్తం 22 నౌకలు ఇప్పటికీ ఆ జలసంధిలో చిక్కుకొని ఉన్నాయి. వాటిలో క్రూడాయిల్, LPG, LNG తదితర గ్యాస్ నిల్వలు ఉన్నాయి.
News March 19, 2026
సౌదీ అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ దాడి

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్‌కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


