News November 30, 2024
36 నిమిషాల్లో ప్రత్యర్థి చిత్తు: ఫైనల్‌కు PV సింధు

స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ తన మునుపటి ఫామ్‌ను ప్రదర్శించారు. సయ్యద్ మోదీ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. యంగ్ షట్లర్, 17 ఏళ్ల ఉన్నతీ హుడాను కేవలం 36 నిమిషాల్లోనే 21-12, 21-9 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె లలిన్‌రత్ చైవాన్ (థాయ్) లేదా వు లువో యు (చైనా)తో తలపడాల్సి ఉంటుంది. సెమీస్‌లో ఆట ఆరంభం నుంచి దూకుడుగా ఆడానని, ఉన్నతికి అస్సలు ఛాన్సివ్వలేదని సింధు అన్నారు.
Similar News
News March 14, 2026
US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్‌తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్‌పై వార్‌కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
News March 14, 2026
డైరెక్టర్‌గా శేఖర్ మాస్టర్.. హీరోగా ప్రభుదేవా కుమారుడు?

డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేరబోతున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కించే సినిమాతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మే నుంచి షూటింగ్ ఉంటుందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిపాయి. మ్యూజిక్, డాన్స్‌కి ప్రాధాన్యమున్న స్టోరీతో ఈ మూవీ రానుందట.
News March 14, 2026
ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.


