News November 30, 2024

ప్రాక్టీస్ మ్యాచ్ ఫస్ట్ డే క్యాన్సిల్

image

ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా పడలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున ఆడనున్నాయి. డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News April 2, 2026

ఢిల్లీ సూపర్ విక్టరీ

image

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.

News April 2, 2026

VDK ‘రణబాలి’ షూటింగ్ సీన్ లీక్

image

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ఓ సీన్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో గుర్రంపై వచ్చిన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్‌లో మాస్ డైలాగులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

News April 2, 2026

ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: ఇరాన్

image

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందన్న <<19538873>>ట్రంప్<<>> వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. అవన్నీ అబద్ధమని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. దేశంలో అధికార మార్పిడి జరగలేదని, పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారని పేర్కొంటూ ట్రంప్ పోస్ట్‌ను కొట్టిపారేసింది.