News November 30, 2024

అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ..: పేర్ని నాని

image

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఒక్కొక్కరిపై 10-12 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతూ, పాత కేసులను తిరగదోడుతోందని మండిపడ్డారు. ‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో’ అని నాని సవాల్ విసిరారు.

Similar News

News March 22, 2026

కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

image

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్‌కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్‌గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.

News March 22, 2026

నేడే రైతు భరోసా నిధుల విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.

News March 22, 2026

IPL 2026 తర్వాత ధోనీ గుడ్ బై: ఉతప్ప

image

IPL 2026 తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప హింట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ కేవలం ఫినిషర్‌గా కాకుండా ‘మెంటార్ కమ్ ప్లేయర్’గా కనిపిస్తారని తెలిపారు. తన రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానానికి పడిపోయే అవకాశం ఉందని, దీనివల్ల రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ మరింత మెరుగుపడుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు.