News November 30, 2024

ఆంజనేయ స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్: CBN

image

AP: సమాజహితం కోసం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని నేమకల్లు సభలో సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఎక్కడికక్కడ డ్రోన్లు ఏర్పాటు చేశాం. ఈ మిషన్‌కి ఈగల్ అని పేరు పెట్టా. రాష్ట్రం మొత్తం డేగకన్నుతో వాచ్ చేస్తున్నాం. ఎవడైనా గంజాయి పండించినా, అమ్మినా అదే మీకు చివరిరోజు అవుతుంది. ఆంజనేయ స్వామి సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్’ అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News January 10, 2026

764 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌(CEPTAM)లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత కలిగినవారు అర్హులు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. టైర్1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్‌: www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.

News January 10, 2026

గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్‌కు ట్రంప్ వార్నింగ్

image

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ డెన్మార్క్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌పై మేమో నిర్ణయానికి వచ్చాం. ఈజీగా ఒక డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాకపోతే కష్టమైన దారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పని మేము చేయకపోతే రష్యా, చైనా చేస్తాయి. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఏదేమైనా గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్పష్టం చేశారు.

News January 10, 2026

NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NHIDCL<<>>లో 64 అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 12) ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com