News November 30, 2024

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేశ్

image

TG: ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు, పదవులుంటాయన్నారు.

Similar News

News December 25, 2025

భీమవరం డీఎస్పీ బదిలీ

image

AP: భీమవరం డీఎస్పీ <<18073175>>జయసూర్యను<<>> డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్‌‌ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ అప్పట్లో కితాబిచ్చారు.

News December 25, 2025

అరటి సాగుకు పిలకల ఎంపికలో జాగ్రత్తలు

image

ఆరోగ్యవంతమైన అరటి తోటల నుంచే పిలకలను ఎంపిక చేయాలి. 3 నెలల వయసు, 2 లేదా 3 కోతలు పడిన సూడి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలపై చర్మాన్ని పలచగా చెక్కి లీటరు నీటికి 2.5ml మోనోక్రోటోపాస్, కాపర్ ఆక్సీక్లోరైడ్ 5గ్రా. కలిపిన ద్రావణంలో 15 ని. ముంచి నాటాలి. పొట్టి పచ్చ అరటిని 1.5X1.5 మీ. దూరంలో, గ్రాండ్ నైన్, తెల్లచక్కెరకేళిని 1.8×1.8 మీ.. మార్టిమాన్, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంతలను 2×2 మీ. దూరంలో నాటాలి.

News December 25, 2025

198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <>www.tgprb.in<<>>లో అందుబాటులో ఉంటాయి.