News November 30, 2024

తూగో: జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్వహణ

image

డిసిల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో ఇసుక తవ్వకాలు జరిపే విధానం ఉండాలని జిల్లా కలెక్టర్, డిఎల్ ‌స్‌ఎ ఛైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌‌లలో సరైన కార్యకలాపాలు నిర్వహించని బోట్స్ మ్యాన్ సొసైటీల అనుమతులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 26, 2026

లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

image

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

News February 26, 2026

CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

image

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 26, 2026

ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

image

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.