News November 30, 2024
నాన్న చిన్నప్పుడు అలా అనేవారు: సమంత

నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తండ్రి గురించి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘మా నాన్న కూడా చాలామంది ఇండియన్ పేరెంట్స్‌లాంటి వారే. ఆయన నాతో ‘నువ్వు అంత తెలివైన దానివేం కాదు. అందుకే నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించగలవు’ అనేవారు. నా జీవితంపై నాన్న మాటల ప్రభావం చాలా ఉంది” అని ఆ ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చారు.
Similar News
News January 23, 2026
మేడారంలో 5,700 టాయిలెట్ల ఏర్పాటు!

మేడారానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల సౌకర్యం కోసం 5,700 టాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. 285 టాయిలెట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి, వీటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు 255 మంది సిబ్బందిని నియమించారు. ప్రధాన ఆలయ పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్ ప్రాంతాల్లో, గ్రామాల నుంచి వచ్చే దారులు, చెరువుల సమీపంలో టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News January 23, 2026
విచారణలో రాధాకిషన్ ఎంట్రీ..? KTR రిప్లై ఇదే!

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తనను విచారించే సమయంలో మాజీ DCP రాధాకిషన్ రావును పిలిపించారనేది అవాస్తవమని KTR స్పష్టం చేశారు. ‘అక్కడ తారకరామారావు తప్ప మరే రావు లేడు. ప్రభుత్వం కుట్రతో ఇచ్చే ఇలాంటి లీకులను మీడియా వెరిఫై చేయకుండా ప్రజలకు చెప్పవద్దు’ అని కోరారు. కాగా SIT ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అంతా అధికారులే చూసుకున్నారని KTR చెప్పడంతో రాధాకిషన్‌ను రప్పించి ఎదురెదురుగా విచారించారని ప్రచారం జరిగింది.
News January 23, 2026
‘హంద్రీనీవా’కు 40TMCల నీరు…CMకు థాంక్స్

AP: హంద్రీనీవా విస్తరణకు కృషిచేసి రాయలసీమకు నీళ్లందించారని CM CBNకు
మంత్రులు కేశవ్, జనార్దన్, MLA కాల్వ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 190 రోజుల్లో 40 TMCల నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 2014-19 మధ్య 6 పంపులుండగా ఇపుడు 100 రోజుల్లో 12 పంపుల సామర్థ్యానికి పెంచడంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా మార్చి నాటికి 50 TMCలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు CM సూచించారు.


