News November 30, 2024
గంభీర్‌ను అలా జడ్జ్ చేయడం సరికాదు: జడేజా

టీమ్‌ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అండగా నిలిచారు. స్వల్ప వ్యవధిలోనే అతడిని జడ్జ్ చేయడం సరికాదన్నారు. ఆటలో గెలుపోటములు సహజమని గుర్తుచేశారు. ‘అతడు బాగాలేడని మీరు నిశ్చయించేసుకుంటే ఏం చేయలేం. ఆటలో కొన్ని దశలుంటాయి. అన్నిసార్లూ గెలవలేరు. అందుకే ఈ ఆర్నెల్ల టైమ్‌లోనే నేనతడిని జడ్జ్ చేయను. అతడు క్లియర్ కట్‌గా ఉండే మనిషి. అందరూ అతడి నుంచి ఊహించిందే మీరు చూస్తున్నారు’ అని అన్నారు.
Similar News
News March 11, 2026
అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <
News March 11, 2026
చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.
News March 11, 2026
భర్తతో విడాకులు.. భరణం ఆశించని హన్సిక

ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా భర్త సోహైల్ నుంచి <<19354762>>డివోర్స్<<>> తీసుకున్న హీరోయిన్ హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు. మనస్పర్ధల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.


