News November 30, 2024
NZB: 9 నెలల్లో 50 వేల GOVT ఉద్యోగాలిచ్చాం: టీపీసీసీ చీఫ్

తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతుంటే.. KCR ఫామ్ హౌస్‌లో పన్నీరు తిన్నాడని మండిపడ్డారు. పదేళ్లలో KCR 50 వేల GOVT ఉద్యోగాలిస్తే తాము కేవలం 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని చెప్పారు.
Similar News
News September 16, 2025
టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.