News November 30, 2024
MDK: నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం: మంత్రి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.
Similar News
News January 25, 2026
మెదక్ : పరేడ్ రిహార్సల్స్ పరిశీలన

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించి, పోలీస్ దళాల విన్యాసాలను పరిశీలించారు. వేడుకల రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
News January 25, 2026
మెదక్ పోలీస్ కార్యాలయం త్రివర్ణ శోభితం

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం శనివారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో త్రివర్ణమయంగా మారింది. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు పరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 24, 2026
MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బైక్ నియంత్రణ తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు హవేలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దూప్ సింగ్ తండాకు చెందిన సుభాష్(34) మెదక్ నుంచి ఇంటికి వస్తుండగా శివారులో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోలేక మరణించాడు. కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.


