News November 30, 2024

మీరెంత? నా కాలి గోటితో సమానం: రేవంత్

image

TG: BRS సహా తాను ఎవరి బెదిరింపులకు భయపడనని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘నేను భయపడితే ఇంత దూరం రాను. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో. పులులను చూశా. అడవిలో ఉండే మృగాలను చూశా. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత? నా కాలు గోటితో సమానం. నేను ప్రభుత్వాన్ని పాలించే పనిలో పడితే.. అలుసుగా తీసుకుని BRS విమర్శిస్తోంది. ప్రజలే వారికి సమాధానం చెప్పాలి ‘ అని CM అన్నారు.

Similar News

News March 24, 2026

ఖమ్మం: వినూత్నం.. డ్రాగన్ ఫ్రూట్‌లో విదేశీ జామ సాగు

image

ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లు గ్రామంలో రైతు కందుల యుగంధర్ సాగు చేస్తున్న జామ తోటను ఉద్యాన అధికారి పి.అపర్ణ సందర్శించారు. డ్రాగన్ ఫ్రూట్‌లో అంతర పంటగా విదేశీ రకాలైన బ్లాక్ డైమండ్, రెడ్ డైమండ్ జామను సాగు చేస్తుండటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. బిందు సేద్యం, మల్చింగ్ పద్ధతుల్లో సాగు చేస్తున్న ఈ పంటకు తీసుకోవాల్సిన ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులను రైతుకు వివరించారు.

News March 24, 2026

పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

image

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్‌ హాట్ టాపిక్‌గా మారింది. <<-se>>#Elections2026<<>>

News March 24, 2026

పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 2/2

image

పాలనపై పూర్తి కంట్రోల్ ఉండట్లేదని, ఈసారి NDA కూటమిలో లాట్చియ జననాయగ కట్చి అనే పార్టీ చేరడం AINRC అసంతృప్తికి కారణం. దీనిని కాంగ్రెస్-DMK తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రహోదా డిమాండ్‌ను కూడా ఎన్నికల అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది. విజయ్ TVK 30 సీట్లలోనూ సోలోగా పోటీ చేయనుండటంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఇక NDAలో భాగమైన AIADMK ఇక్కడ ఉనికి కోసం పోరాడుతోంది. <<-se>>#Elections2026<<>>