News November 30, 2024

ఆస్ట్రేలియా వీసా ఫీజు పెంపుపై భారత్ ఆందోళన

image

అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఫీజును ఆస్ట్రేలియా సుమారు రూ.38,930 నుంచి రూ.87,731కి పెంచడంపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక భారం మోపుతుందని ఆస్ట్రేలియా అధికారులకు చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు. కాగా.. గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యలో చదువుకోసం 1.22లక్షలమంది భారతీయులు ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు.

Similar News

News November 4, 2025

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్‌ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.

News November 4, 2025

హిందూజా గ్రూప్ ఛైర్మన్ మృతి

image

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

News November 4, 2025

కార్తీక మాసం: దీపాలెందుకు పెడతారు?

image

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.