News November 30, 2024

ఎల్లుండి హైదరాబాద్‌లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

image

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించిన ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ హైదరాబాద్‌లోనూ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జాతర మొదలవుతుందని తెలిపింది. అభిమానులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.

Similar News

News March 17, 2026

నవోదయ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

image

నవోదయ విద్యాలయ సమితి (NVS) JNVST 6వ తరగతి ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేసింది. షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత అడ్మిషన్ ఖరారు అవుతుంది. రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 17, 2026

ఏపీకి అదనపు LPG, తెలంగాణకు ఎప్పుడు?

image

ఏపీకి కేంద్రం అదనంగా <<19410312>>24,000<<>> మెట్రిక్ టన్నుల LPGని కేటాయించగా, తెలంగాణ ఇంకా స్పందన కోసం ఎదురుచూస్తోంది. వాణిజ్య అవసరాల కోసం అదనపు LPG కోరుతూ మంత్రి ఉత్తమ్ 3 రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో కొరతతో హోటల్ పరిశ్రమ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. నేటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్తమ్ కేంద్ర అధికారులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.

News March 17, 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సానియా మీర్జాకు భయానక అనుభవం!

image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అక్కడ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె మీడియాకు వివరించారు. ‘మేమున్న ఇంటి పైనుంచే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానినొకటి అడ్డుకోవడం చూశాం. మా ఇంటికి 400-500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి’ అని తెలిపారు.