News November 30, 2024

అనంత: ఫార్మాడీ పోస్ట్ బ్యాకలోరియెట్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని ఫార్మా డీ పోస్ట్ బ్యాకలోరియెట్ 1, 2వ సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News March 5, 2026

బెంబేలెత్తుతున్న అనంతపురం జిల్లా ప్రజలు

image

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో అనంత జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గుంతకల్లు మండలంలో 39.8, యల్లనూరులో 38.4, పెద్దపప్పూరులో 38.3, తాడిపత్రిలో 37.7, బి.సముద్రంలో 37.6 డిగ్రీలు నమోదయ్యాయి.

News March 4, 2026

‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

image

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

News March 4, 2026

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై దుష్ప్రచారం

image

ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1993 డిసెంబర్ 21న పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను తాజాగా జరిగినట్టుగా, బంగారు విగ్రహాల విలువ రూ.150 కోట్లుగా వక్రీకరిస్తున్నారు. అయితే అప్పట్లోనే ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విగ్రహాల విలువ రూ.50 వేలుగా నమోదు చేసి, 1994లో కేసు మూసివేశారు.