News November 30, 2024

BREAKING: ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు

image

TG: మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2002 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్న వారే అర్హులంది. సరైన అర్హతలు లేకపోవడంతో 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. వీరిని 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం మళ్లీ తీసుకోగా, దీన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన GOపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ GOను కోర్టు రద్దు చేసింది.

Similar News

News December 31, 2025

జపాన్‌ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

image

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్‌లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.

News December 31, 2025

సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు.. కారణమిదే!

image

UPలోని మథురలో జరగాల్సిన సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దయింది. పవిత్రమైన శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సన్నీలియోన్‌తో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు పెద్దఎత్తున ప్రచారం చేశారు. టికెట్లూ అమ్మారు. అయితే సాధువులు, మత సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ రద్దయింది.

News December 31, 2025

డిసెంబర్ 31: చరిత్రలో ఈరోజు

image

✒1600: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు
✒1928: తెలుగు సినిమా నటుడు, మాజీ MP కొంగర జగ్గయ్య జననం
✒1953: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి జననం (ఫొటోలో)
✒1965: భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి VP మేనన్ మరణం
✒2020: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మరణం