News November 30, 2024
శ్రీకాళహస్తిలో దారుణ హత్య

శ్రీకాళహస్తి రూరల్ మండలం చిన్నమిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ ఒటి గుంట సెంటర్లో ఓ వ్యక్తి శనివారం హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం K.వెంకటాపురం గ్రామానికి చెందిన గుండుగారి రవి (30)ని ఒటిగుంటకు చెందిన ఆర్ముగం (38) శనివారం కత్తితో నరికి హత్య చేశాడు. రూరల్ సీఐ రవి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 26, 2026
గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్‌కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 26, 2026
చిత్తూరు: విస్తృత భద్రత ఏర్పాట్లు

శ్రీరామనవమి పురస్కరించుకొని దేవాలయాలు, ముఖ్య ప్రదేశాలు, శోభాయాత్రలు నిర్వహించే ప్రాంతాలలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని.. ఏ సమస్య వచ్చిన పోలీసులను సంప్రదించాలని కోరారు.
News March 26, 2026
చిత్తూరు: సరదా మాటున ప్రమాదం.. జాగ్రత్త.!

వేసవి, ఒంటిపూట బడులు కావడంతో పలువురు చిన్నారులు, యువకులు చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు సరదా చూపుతున్నారు. వీరిని చూసి ఈతరాని వారు కూడా నీళ్లల్లోకి దిగుతుండడంతో మృత్యువాత పడే అవకాశం ఉంది. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఈత నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో తల్లితండ్రుల పర్యవేక్షణ తప్పక ఉండాలన్నారు. ఈత రానివారు నీరు ఉన్న చోట్లకు వెళ్లకుండా అప్రమత్తత వహించాలన్నారు.


