News December 1, 2024
కేంద్రమంత్రిపై తేనెటీగల దాడి.. రక్షించిన సిబ్బంది

మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల దాడి జరిగింది. శివపురి జిల్లాలోని మాధవ్ నేషనల్ పార్కులో ఓ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఆయన వెళ్లారు. ఈలోపే ఒక్కసారిగా తేనెటీగలు వచ్చిపడటంతో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది కర్చీఫ్‌లు, టవల్స్‌తో ఆయనకు రక్షణ కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.
Similar News
News January 14, 2026
రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. 22/ఏ సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించి అమరావతి మండలం, 4 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. డీఆర్ఓ మురళి, డీఐజీ జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News January 14, 2026
నేటి ముఖ్యాంశాలు

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్లు, సిట్ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC
News January 14, 2026
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


