News December 1, 2024

‘OG’లో మరో స్టార్ హీరో?

image

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరో మూవీ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇస్తారని సమాచారం. ‘సాహో’ కథ జరిగిన ప్రపంచంలోనే OG స్టోరీ కూడా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు వార్తలొచ్చాయి. దీంతో ఆ హీరో ప్రభాసేనా అన్న చర్చ నడుస్తోంది. దీనిలో నిజమెంతో చూడాలి మరి.

Similar News

News November 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.

News November 9, 2025

HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<>HCL<<>>) 64 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 27 నుంచి DEC 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.hindustancopper.com/

News November 9, 2025

పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.