News December 1, 2024
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు

కూచ్ బిహార్ ట్రోఫీలో బిహార్ బౌలర్ సుమన్ కుమార్ రికార్డ్ సృష్టించారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. 23వ ఓవర్‌లో తొలి వికెట్ తీసిన ఈ పేసర్ రెండో వికెట్ కోసం మరో 10 ఓవర్ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సుమన్ చెలరేగారు. తర్వాతి 8 వికెట్లనూ పడగొట్టారు. దీంతో రాజస్థాన్ 182 రన్స్‌కు ఆలౌటైంది. కాగా గతంలో అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీలో 10 వికెట్లు తీశారు.
Similar News
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.