News December 1, 2024

ద్వైపాక్షిక సంబంధాల పట్ల టర్కీ ఆసక్తి:మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు టర్కీ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆయన భేటీ అయ్యారు. పరస్పర సహకారంపై అరగంట సేపు వారు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైందని టర్కీ పారిశ్రామిక బృందాన్ని పంపించి ఇక్కడి ఎకోసిస్టంను వారు పరిశీలించేలా చొరవ తీసుకోవాలన్నారు.

Similar News

News March 27, 2026

వరంగల్: కాంగ్రెస్ పాత కమిటీల రద్దు

image

జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తెలిపారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సిటీలో డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత చేపడతామని పేర్కొన్నారు. కమిటీల్లో పదవుల కోసం నేతలు పోటీ పడనున్నారు. మండల అధ్యక్ష పదవులపై ఆయా ప్రాంతాల్లో పోటీ పెరగనుంది.

News March 25, 2026

WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.