News December 1, 2024

డిసెంబర్ 3న యాదగిరిగుట్ట స్వామి వారి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని డిసెంబర్ 3న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 14, 2025

NLG: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

NLG: ఢిల్లీలో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

image

తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్‌‌‌ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో భారతి మండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్ మోడల్ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్ట్ ఎంపికైంది. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు లూనావత్ అఖిల్, బానోతు తరుణ్‌లను ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

News January 13, 2025

NLG: పండగ తర్వాత రంగంలోకి బృందాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.