News December 1, 2024
భద్రాద్రి: పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్
ధరణి పెండింగ్ దరఖాస్తుల ను పరిష్కరించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కలెక్టర్ ధరణి దరఖాస్తులపై జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. అన్ని మాడ్యూల్స్‌లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 1, 2024
సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పిస్తాం: ఎంపీ RRR
అమెరికా కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన <<14750277>>సాయితేజ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ రఘురాంరెడ్డి ఫోన్లో సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా పంపించాలని వీదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు.
News November 30, 2024
KMM: రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం: మంత్రి తుమ్మల
పదేళ్ల BRS పాలనలో ఛిన్నాభిన్నమైన తెలంగాణను CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. MBNRసభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఆగమైందని, ఏడాదిగా బాగు చేస్తున్నామని తెలిపారు. ‘అన్నా.. కష్టాలున్నా.. అప్పులున్నా.. కడుపు కట్టుకోనైనా సరే రైతు రుణమాఫీ చేద్దామని’ సీఎం అన్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు.
News November 30, 2024
KMM: BRS వాళ్ల లాగా గాలి మాటలు మేం చెప్పం: భట్టి
వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.