News December 1, 2024
HYD: మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో కొత్త రక్తం చేరబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని, తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని మోదీ చెప్పారని అన్నారు. డిసెంబర్ 6న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
HYD: 1,200 బస్సులతో సంక్రాంతికి వస్తున్నాం..!

జనవరి వచ్చిందంటే సంక్రాంతి ముచ్చట్లే ఉంటాయి. సొంతూరుకు ఎప్పుడెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే చర్చలు ఎక్కడ చూసినా ఉంటాయి. సంక్రాంతి సెలవుల్లో సొంతూరిలో గడిపితే ఆ మజానే వేరబ్బా అని పలువురు నగరవాసులు భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ నగర ప్రయాణికుల కోసం ఈ ఏడాది 1,200 ప్రత్యేకంగా బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించింది.
News January 5, 2026
HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
News January 5, 2026
పాకిస్థాన్‌లోని ఉగ్రమూకలను లాక్కురండి: ఒవైసీ

ఇండియాలో పలు చోట్ల విధ్వంసం చేసి పాకిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలను అక్కడకెళ్లి లాక్కురావాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. వెనుజులా అధ్యక్షుడినే అమెరికా తీసుకెళ్లినపుడు.. మీరు ఉగ్రవాదులను పాకిస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకురాలేరా? అని ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని ప్రశ్నించారు. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులను లాక్కురండి అని పేర్కొన్నారు.


